24-04-2025 12:03:59 AM
ముగ్గురి అరెస్టు..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): ఎక్సైజ్ శాఖ సికింద్రాబాద్ డి టి ఎఫ్, ఎస్ టి ఎఫ్ డి టీమ్‌ల సిబ్బంది రెండు చోట్ల నిర్వహించిన తనిఖీల్లో 5.260 కేజీల గంజాయిని పట్టుకొని, ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఓ కారు, నాలుగు సెల్ ఫోన్లు ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ ప్రాంతానికి చెందిన మలావత్ రాజేందర్, ఇండాల్ రాథోడ్‌లు కలిసి హైదారాబాద్ లో విక్రయించేందుకు గంజాయిని కారులో తీసుకొచ్చారు.
బొయినిపల్లి సమీపంలో కారును నిలిపి తనిఖీలు నిర్వహించగా కారు డిక్కిలో 4.140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సౌజన్య తెలిపారు. కొండాపూర్ బొటానికిల్ పార్కు సమీపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్ టి ఎఫ్ డీ టీమ్ ఎస్సు జ్యోతి టీం తనిఖీలు నిర్వహించి గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో పశ్చిమబెంగాల్‌కు చెందిన నారాయణ చౌదారి అనే వ్యక్తి అరెస్టు చేశారు. 1.12కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.