12-03-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 11 (విజయక్రాంతి): నగరంలోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో హైదరాబాద్ కమిష సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 30.70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ యాసిన్ అనే వ్యక్తితో పాటు ఒడిశాకు చెందిన గోపాల్‌ఖారా, ఉత్తమ్‌తమెల్‌లను అరెస్ట్ చేసినట్టు కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు తెలిపారు. తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ సైదాబాబు, హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ సీఐ సురేందర్ పాల్గొన్నారు.
మేడ్చల్ పరిధిలో గంజాయి విక్రయం జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం మేరకు కిష్టాపూ మేడ్చల్ ఎక్సుజ్ పోలీస్ ఎస్సు రాఘావేశ్వర్‌రావు, సిబ్బంది శ్రీనివాస్, మన్సూర్ మగళవారం తనిఖీలు నిర్వహించారు. ఒడిశా మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన బామే సమర్ శరకర్(47) అనే వ్యక్తి ఒడిశౠ నుంచి గంజాయిని తెచ్చి మేడ్చల్‌లోని ఇండస్ట్రియల్ ప్రాంతంలో అమ్ముతున్నట్టు గుర్తించారు. అతడ్ని అరెస్టు చేసి, 3.50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు