12-02-2025 12:19:51 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): భారీగా గంజాయి నీ తరలిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి జిల్లాలో భారీగా గంజాయిని పట్టు కున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలి పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంతరాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడిన వివరాలను వెల్లడించారు.
పక్కా సమాచారం మేరకు అక్రమంగా గంజా యిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు. గంజాయి మత్తు పదార్థాలు రవాణా చేసే వ్యక్తులపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలి పారు. రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాలు ఆల్ఫాజూలం గంజాయి వంటి నిషేధిత పదార్థాలను రవాణా చేస్తే ఉపేక్షించేది లేదని వారిపై పిడి యాక్ట్ తో పాటు కఠిన శిక్ష లు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని జెమినీ తం డా చెందిన సత్యం, వినోద్, శంకర్, నల్గొండ జిల్లాలోని అంబాల గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తులు గంజాయి నీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల నుండి తీసుకువచ్చి కర్ణాటక సరిహద్దుల్లో నిల్వచేసి అక్కడి నుండి మహారాష్ట్ర నాందేడ్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
పక్కా సమా చారం మేరకు మంగళవారం ఉదయం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లోని మాజీ గ్రామ శివారులో ఎక్సైజ్ పోలీసులు గంజాయి తరలిస్తున్న రెండు కారులను వెంబడించ గా ఒక కారు లో పట్టుకున్నట్లు తెలిపారు పరారైనట్లు తెలి పారు. అంతర్ రాష్ట్ర ముఠా గంజాయిని రెండు కారులలో తరలిస్తున్నా రు.
అన్న పక్క సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు గంజాయి తరలి స్తున్న రెండు కాలనీ వెంబడించారు గంజా యి తరలిస్తున్న స్కార్పియో వాహనం ద్విచ క్ర వారంతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 90 కిలోల 830 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవ డం జరిగిం దన్నారు వీటి విలువ 50 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. పట్టుబడ్డ వారిని అరెస్టు చేసి రిమాండ్ తర లించినట్లు తెలిపారు.
గంజాయి తరలించి విక్రయించిన వారిపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలి పారు. ఈ గంజాయి ముఠాకు ఇతర రాష్ట్రా ల లోని గంజాయి ముఠాలకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుందన్నారు. గంజాయి తరలించిన గంజాయి విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ సూపర్డెంట్ నరసింహారావు బాన్సువాడ ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.