08-02-2025 01:14:02 AM
చార్మినార్, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): సౌత్, ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, చాంద్రాయణగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించి అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ జైపాల్ కోసం పని చేసే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 200 కిలోల గంజాయితో పాటు ఓ కారు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం విలేకరుల సమావేశంలో కాంతిలాల్ పాటిల్ మాట్లాడుతూ.. ఎర్కపల్లి గ్రామానికి చెందిన జాదవ్ శివరాం(34) మధ్యవర్తిగా ఒడిశాకు వెళ్లి అక్కడ సుభాష్ వద్ద గంజాయి కొనుగోలు చేశాడు. ఒడిశా నుంచి ఎల్బీనగర్‌లో జైపాల్‌కు గంజాయిని ఇచ్చేందుకు శంషాబాద్ మీదుగా తన కారులో వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
గంజాయి తరలిస్తున్న టీఎస్ 15 ఎఫ్‌సీ 8882 నెంబర్ గల హ్యుందాయ్ కారును సీజ్ చేశామన్నారు. ఈ కేసులో అంతర్‌రాష్ట్ర నిందితులుగా ఉన్న సుభాష్, బనవత్ జైపాల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.