పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (విజయక్రాంతి): మల్కాజిగిరి ఎక్సుజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాను ఎన్‌క్లేవ్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ సీఐ బిక్షారెడ్డి, ఎస్సు బాలరాజు సిబ్బందితో దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో మోహిత్, రాహుల్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా బెంగుళూరు నుంచి 57 గ్రాముల గంజాయి(ఓజీ ఖుష్)ని తెప్పించి ఇక్కడ విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
నిందితులను అరెస్ట్ చేసి మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. వీరిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తనిఖీల్లో ఎస్టీఎఫ్ సిబ్బంది యాదగిరి, నితిన్, కౌశిక్, సాయి కిరణ్, లక్ష్మి పాల్గొన్నారు.
యాదవనగర్‌లో..
మల్కాజ్‌గిరి ఎక్సుజ్ పోలీస్ స్టేషన్ పరిధి తిరుమలగిరి రెసిడెన్సీ యాదవనగర్‌లో అద్దెకు ఉంటున్న నలుగురు యువకులు గంజాయి అమ్మకాలు జరుపుతూ శనివారం ఎక్సైజ్ సిబ్బందికి చిక్కారు. వారి వద్ద నుంచి 1.1 కేజీల గంజాయి లభించినట్లు ఎస్టీఎప్ సీఐ నాగరాజు తెలిపారు. రాజమం డ్రి, విశాఖ, బెంగళూరుకు చెందిన.. తేజ వీరసాయి, సాయి కిరణ్, రమణ రాయన్, చంద్రశేఖర్ ముఠా గా ఏర్పడి నగరంలో గంజాయి వ్యాపా రం చేస్తున్నారు.
నిందితులను అరెస్టు చేసి మల్కాజిగిరి ఎక్సుజ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ ఆపరేషన్‌లో ఎస్‌ఐ జ్యోతి, కానిసేబుళ్లు రాజేశ్, విక్రమ్, వినోద్, శశికిరణ్, అనురాధ తదితరులు ఉన్నారు.