calender_icon.png 4 March, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్బుపై ఆశతో గంజాయి తరలింపు

04-03-2025 12:36:33 AM

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడమే ధ్యేయం 

మానుకోటకు తరలిస్తూ పోలీసులకు చిక్కిన వైనం

మహబూబాబాద్, మార్చి 3 (విజయక్రాంతి) : తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో గంజాయి రవాణా చేస్తూ ఇద్దరు యువకులు పోలీసులకు పట్టుబడిన ఘటన సోమవారం మహబూ బాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ ఎస్పీ సుదీర్ డి.ఎస్.పి సూచనల మేరకు గూడూరు మహబూబాబాద్ మధ్యలో మట్టెవాడ క్రాస్ రోడ్డు  మచ్చర్ల గ్రామంలో పోలీసులు గంజాయి తరలిస్తున్నారని ముందస్తు సమాచారంతో వాహనాలను తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనం మీద ఇద్దరు వ్యక్తులు సుమారు 05.440 కేజీల ఎండు గంజాయి తో పట్టుబడ్డారు కాగా వారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం సీలేరు నుండి గూడూరుకు తీసుకువచ్చి మహబూబాబాద్ లో అమ్మడానికి వెళ్తూ మార్గమధ్యంలో పోలీసులకు చిక్కారు.

ఈ సందర్భంగా నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు మండలానికి చెందిన మేడ సుజిత్ తండ్రి నారాయణ రావు 21 సంవత్సరాలు కాగా భూక్య మునేష్ తండ్రి వీరన్న వయసు 23 సంవత్సరాలు పొనుగోడు గ్రామ వాసిగా గుర్తించారు.

కాగా వారి దగ్గర నుండి 05.440 కిలోల ఎండు గంజాయి  సుమారు 2,72,000 విలువగల గా గుర్తించారు నిందితుల నుండి బైకు రెండు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో గూడూరు సిఐ సూర్యప్రకాష్ ఎస్‌ఐ గిరిధర్ రెడ్డి ఏ ఎస్ ఐ విచ్చనాయక్  నాయక్ రాజేష్ ప్రణీత్ అమృరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.