calender_icon.png 22 April, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి ముఠా అరెస్ట్

22-04-2025 12:00:00 AM

2 కిలోల సరుకు స్వాధీనం

కార్వాన్, ఏప్రిల్ 21: గంజాయి విక్రయిస్తున్న నలుగురిని సోమవారం కమిషనర్ టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్ బృందం, హుమాయున్ నగర్ పోలీసులు సమన్వయంతో  పట్టుకున్నారు. వివరాలు.. హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని l ఫస్ట్ లాన్సర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలోని ఈద్గా గ్రౌండ్స్లో  గంజాయిని విక్రయించి సేవిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితులైన మొహమ్మద్ సోఫియావుద్దీన్,  సయ్యద్ దావూద్ అలీ, సయ్యద్ రోమన్ అలీ, మొహమ్మద్ అయూబ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులు మహారాష్ట్రలోని నాగపూర్ తాజ్ బాగ్ దర్గా సమీపంలో నుంచి కొనుగోలు చేసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.