25-03-2025 12:00:00 AM
రెండు కేసుల్లో 119 కేజీల గంజాయి, కారు స్వాధీనం
ముగ్గురు బీకెట్ విద్యార్థుల అరెస్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 24(విజయక్రాంతి) : నగరంలోని జెఎన్టీయుహెచ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఎక్సైజ్ ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్‌సి టీమ్ లీడర్ డీఎస్పీ తుల శ్రీనివాసరావు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శివ సిద్దు బృందం నిర్వహించిన తనిఖీల్లో 115 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఓ గంజాయి డాన్‌ను, ముగ్గురు బీటెక్ విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. సోమవారం ఎక్సైజ్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఖురేషీ మాట్లాడుతూ రెండు కేసుల్లో పట్టుకున్న 119 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒరిస్సా నుంచి పలు రాష్ట్రాలకు గం జాయి సరపరా చేస్తూ గంజాయి డాన్ ముద్రావేసుకున్న దుగ్యంపూడి శివారెడ్డి అనే వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుంచి 115 కేజీల గంజాయిని స్వాధీ నం చేసుకున్నామని, ఓ కారును స్వా ధీనం చేసుకున్నామని చెప్పారు. మరో కేసులో కేపీహెచ్‌బీ వసంతనగర్ కాలనీలో బీటెక్ చదువుకుంటూ ఉద్యోగా లు చేస్తున్న ముగ్గురు విద్యార్ధులు అద్దె కు ఉంటున్న ఇంట్లో తనిఖీలు చేసి 4కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. రాహు ల్, అజయ్ కుమార్, తాడిపల్లి అభిలాష్‌లను అను అరెస్టు చేసినట్లు చెప్పారు.