calender_icon.png 5 January, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

449 కిలోల గంజాయి దహనం

30-12-2024 11:43:03 PM

ఖమ్మం (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్లలో నమోదైన 24 కేసుల్లో పట్టుకున్న 449 కిలోల గంజాయిని సోమవారం కాల్చి వేసినట్లు ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి సోమవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. గంజాయిని ఖమ్మం పరిధిలోని గోపాలపేట ఏడబ్ల్యుఎం కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో దహనం చేశామని చెప్పారు. కాల్చివేసిన గంజాయి విలువ రూ.1.12 కోట్ల విలువ వుంటుందని అంచనా వేశారు. గంజాయిని కాల్చివేసిన సిబ్బందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌తో పాటు అసిస్టెంట్ కమిషనర్ గణేశ్, భద్రాచలం సిఐ రసూల్ ఉన్నీసాబేగం తదితరులు ఉన్నారు.