ఆదిలాబాద్ (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లాలో నమోదైన 26 కేసుల్లో పట్టుబడ్డ 78 కిలోల 295 గ్రాముల గంజాయిని పోలీసులు దహనం చేశారు. జిల్లా ఎస్పీ గౌష్ అలం ఆదేశాల మేరకు జిల్లాలో పట్టుబడ్డ 78 కిలోల 295 గ్రాముల గంజాయి ని నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి వద్ద గల శ్రీ మెడికేర్ సర్వీసెస్ సెంటర్ లో సోమవారం గంజాయి డిస్పోజల్ కమిటీ సమక్షంలో గంజాయి ని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డి.సి.ఆర్.బి డీఎస్పీ సిహెచ్ నాగేందర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పాండేరావు, డి.సి.ఆర్.బి ఎస్.ఐ హకీమ్ తదితరులు ఉన్నారు.