29-04-2025 12:07:04 AM
రూ.2.5 కోట్ల గంజాయి సీజ్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): పనస పండ్ల మధ్యలో గంజాయి మూటలు పెట్టి తరలిస్తున్న వ్యాన్ ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం ఒడిషా నుంచి ఏపీలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడ మీదుగా పెద్ద ఎత్తున గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు ఓఆర్‌ఆర్‌పై తనిఖీలు చేశారు.
పలాస నుంచి పనస పండ్ల లోడ్‌తో వస్తున్న మినీ వ్యాన్‌ను తనిఖీ చేయగా పండ్ల కింద గంజాయి మూటలు గుర్తించారు. గంజాయి తరలిస్తున్న గణేష్ రామస్వామి, విజయ్ శంకర్‌కులకర్ణి అనే వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు రూ.2.50కోట్ల విలువైన 410 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని పట్టుకున్న అధికారులు, సిబ్బందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీకమలాసన్‌రెడ్డి అభినందించారు.