calender_icon.png 22 April, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జువాలజీ లెక్చరర్‌గా మరియం ఫాతిమా

22-04-2025 12:00:00 AM

జగిత్యాల, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ఇటీవల జరిగిన జూనియర్ లెక్చరర్ల ఎంపికలో జిల్లాలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రానికి చెందిన మరియం ఫాతిమా జువాలజీ సబ్జెక్టు లెక్చరర్గా ఎంపికయ్యారు. పోస్టింగుల్లో భాగంగా మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల జువాలజీ విభాగం లెక్చరర్గా ఆమెకు ప్రభుత్వ ఉత్తర్వులు అందాయి.

ఈ మేరకు మంచిర్యాల ప్రభుత్వ కళాశాలలో జేయల్గా ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. కోరుట్లకు చెందిన మరియం ఫాతిమా తల్లిదండ్రులు ఎం.ఏ.బారి, సెలిన్ బారీ ఇరువురూ కేరళ హై స్కూల్ విద్యా సంస్థ నడుపుతున్నారు. కాగా బాల్యం నుండి పట్టుదలతో చదివి, ప్రభుత్వ లెక్చరర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మరియం ఫాతిమాను కోరుట్ల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వారు, పలువురు ప్రముఖులు అభినందించారు.