calender_icon.png 26 April, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఐ పట్టణ తాత్కాలిక కన్వీనర్ గా మారెడ్డి శివాజీ

26-04-2025 12:58:37 PM

భద్రాచలం (విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ(Communist Party of India) సిపిఐ పట్టణ తాత్కాలిక కన్వీనర్ గా మారెడ్డి శివాజీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎస్విఎస్ నాయుడు అధ్యక్షతన జరిగిన పట్టణ ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశంలో ఈ ఎన్నిక చోటుచేసుకుంది. ఏఐటీయూసీ పట్టణ తాత్కాలిక కన్వీనర్ గా కంభం మెట్టు శ్రీనివాస్, ఏఐవైఎఫ్ పట్టణ తాత్కాలిక కన్వీనర్ గా గుంజా రామారావు, మహిళా సమాఖ్య పట్టణ తాత్కాలిక కన్వీనర్ గా బైరు వరలక్ష్మిని కూడా పట్టణ కమిటీ ఎన్నుకుంది.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన  జిల్లా కార్యవర్గ సభ్యులు రావులపల్లి రవికుమార్ మాట్లాడుతూ  మే డే ను వాడ వాడల ఘనంగా నిర్వహించుకుందామని చెప్పారు.

పార్టీ తాత్కాలిక కన్వీనర్లుగా ఎన్నికైన సభ్యులు చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని చెప్పారు. కార్మిక వర్గాన్ని ఏకం చేసి  కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాధికారులకు వినతి పత్రాలు అందజేసి  సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని, యువజన నాయకత్వం కూడా చురుకైన పాత్ర పోషిస్తూ పార్టీ కార్యక్రమాల్లో అగ్రభాగాన నిలవాలన్నారు. మహిళా సమాఖ్య ద్వారా  మహిళల పట్ల జరుగుతున్న దాడులు, అగాయిత్యాలు, హింసలు, ఇబ్బందులపై నిరసన వ్యక్తం చేయాలని, అందరినీ సంఘటితపరచి కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పారు. పార్టీపరంగా ఏ సమస్యలు ఎదురైనా జిల్లా నాయకత్వానికి వివరించి వారి సలహాలు సూచనలతో ముందుకు సాగుదాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మీసాల భాస్కరరావు,  ఏపూరి వెంకటేశ్వరరావు, మహేష్, త్రిమూర్తులు, వెంకన్న, శోభన్, సీతారామరాజు, వెంకటమ్మ, రమణమ్మ, జ్యోతి,అజీమ్, చంటి, వెంకట రావు, సతీష్ కుమార్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.