08-04-2025 05:33:13 PM
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జై బాపు జై భీమ్ జై సంవిదాన్ పాదయాత్ర కార్యక్రమాలు మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృతంగా చేపట్టారు. మంగళవారం మద్నూర్ మండలంలోని ఖరగ్, చిన్న తడుగూర్, పెద్ద తడగూర్, అంతాపూర్, సోమూర్, రాచూర్, ఈ ఆరు గ్రామాల్లో విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షణ కొరకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.
వారు మాట్లాడుతూ... మహాత్మాగాంధీ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. ఈ మూడు సూత్రాలమీద దేశం మొత్తం మీద కార్యక్రమం జరుగుతుందన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెల్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మిర్జాపూర్ హనుమాన్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హన్మంతు యాదవ్ హనుమాన్లు స్వామి కొండ గంగాధర్ వట్నాల రమేష్ బండి గోపి కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.