16-04-2025 02:09:07 AM
ప్రారంభించిన మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): ఈనెల 27న వరంగల్ లో జరిగే బి ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట నుండి యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వరకు చేపట్టిన పాదయాత్ర ను మాజీ మంత్రి గుంతకంట్ల జగదీశ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో విఫలమైందని. ఎన్నికల హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు.
ఈ ప్రజలైతే కాంగ్రెస్ సర్కార్ను తీసుకువచ్చారు ఆ ప్రజలే నేడు తప్పు చేశామని గ్రహించి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్నారు. వరంగల్ లో జరిగే పార్టీ రజితోత్సవ భారీ బహిరంగ సభకు కార్యకర్తలు ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్ కుమార్,, పైళ్ల శేఖర్ రెడ్డి బూడిద బిక్షమయ్య గౌడ్, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, క్యామ మల్లేష్, తోట్ల స్వామి, బి ఆర్ ఎస్ వి నాయకులు బూరుగు నవీన్ గౌడ్ ,ప్రశాంత్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.