calender_icon.png 11 April, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ పరిరక్షణ కోసమే పాదయాత్ర

04-04-2025 06:36:00 PM

మద్నూర్ మండల విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్

మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు.   మద్నూర్ మండలంలోని తడి ఇప్పర్గా, గోజేగావ్ గ్రామాల్లో కాంగ్రెస్ మండల నాయకులు పాదయాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కలిసికట్టుగా పోరాడుదాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంతు యాదవ్, మాజీ ఎంపీపీ ప్రజ్ఞా కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శివాజీ రాథోడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్, గురూజీ, కొండ, గంగాధర్, బండి గోపి, కర్ల సాయిలు, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.