calender_icon.png 26 December, 2024 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగర యువతను ఉర్రూతలూగించిన మారథాన్

22-09-2024 02:37:36 PM

3K , 5K , 10K , 21K  రన్  పరుగులు తీసిన యువత 

కరీంనగర్, (విజయక్రాంతి): కరీంనగర్ సైక్లిస్ట్ అసోసియేషన్ (కేఆర్ సీఏ) ఆధ్వర్యంలో ఆదివారం మారధాన్ రెండవ ఎడిషన్ ను అంబేద్కర్ స్టేడియంలో  నిర్వహించడం జరిగింది. (KRCA) ప్రెసిడెంట్, ఐవిహై విద్యాసంస్థ అధినేత పసుల మహేష్ అటు పాఠశాల విధి నిర్వహణ చూసుకుంటూ ఇటు నగర ప్రజల ఆరోగ్య దృష్ట్యా స్వచ్ఛంద సేవా కార్యక్రమం అయిన  మారథాన్ ను అంబేద్కర్ స్టేడియం లో నిర్వహించడంతో యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మారథాన్ లో పాల్గొన్నారు. మనకోసం మన కరీంనగర్ ప్రజల కోసం ఉరుకుల పరుగుల జీవితంలో శరీరానికి అలసట లేకుండా పోయి ఒత్తిడితో కూడిన జీవనం సాగిస్తున్నారని నగర వాసులకు అలాంటి అలవాట్లను మార్చే ఉద్దేశంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో ఒకటైన మారథాన్ రెండో ఎడిషన్ ను నిర్వహించడం జరిగిందని పసుల మహేష్ మాట్లాడారు.

కనీసం వారంలో ఒకసారైనా వ్యాయామం చేయడం వాకింగ్ జాగింగ్ రన్నింగ్ తో శరీరాన్ని కదిపితే లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉంటాయని వారు పేర్కొన్నారు. రన్ ను నాలుగు కేటగిరీల్లో నిర్వహించామని దీనికి సహకరించిన జిల్లా పాలన యంత్రాంగం మరియు పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మారథాన్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నరేందర్ ఇతర పోలీస్ సిబ్బంది మారధాన్ లో పాల్గొన్నారు.

అంతేకాకుండా ప్రముఖ వ్యక్తులు ఆల్ఫోర్స్ పాఠశాలల చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, లక్ష్ పాఠశాల చైర్మన్ మహమ్మద్ ముస్తాక్ అలీ, ఇతర ప్రముఖులు, సిద్ధార్థ పాఠశాలల విద్యార్థులు, ఐవి హై  పాఠశాల విద్యార్థులు, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు , శ్రీ చైతన్య డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు, NCC  కేడేట్స్, NSS విద్యార్థులు,(KRCA) సభ్యులు పాల్గొనడం జరిగింది. అన్ని పాఠశాలల విద్యార్థులు వారి తల్లిదండ్రులు భారీ ఎత్తున మారథాన్ లో పాల్గొన్నారు. అనంతరం రన్ లలో  పాల్గొని వచ్చినవారికి మెడల్స్ అల్పాహారం ఇవ్వడం జరిగింది. 3K, 5K, 10K , 21K లో పాల్గొని విజేతలు అయిన వారికి నగదు బహుమతి, ప్రశంస పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రముఖులకు మెమెంటో లు అందజేసి సన్మానం చేయడం జరిగింది. ఈ విధంగా జరిగిన  మారదాన్ లో యువత నృత్యం చేయడం నగర ప్రజలందరినీ  ఆకట్టుకుంది.