calender_icon.png 24 November, 2024 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు మరాఠీలు గుణపాఠం చెప్పారు

24-11-2024 12:55:09 AM

 మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, నవంబర్ 23 (విజయ క్రాంతి): మహారాష్ర్టలో ఐదు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీలను మరాఠీ ప్రజలు నమ్మలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ చేసిన మోసాలను మహారాష్ర్ట ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని అన్నారు.

తెలంగాణలో మహిళలకు రూ.2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ర్టలో రూ. 3వేలు  ఇస్తామనడం, రైతు భరోసా, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపినట్లు తెలిపారు.

తెలంగాణ ప్రజలు మహారాష్ర్టలోని ముంబై, షోలాపూర్, పుణె, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండటంతో వారంతా కాంగ్రెస్ చేసిన మోసాలను అక్కడి ప్రజలకు వివరించారని ఆయన పేర్కొన్నారు.

జార్ఖండ్‌లో హేమంత్ సోరేన్‌పై బీజేపీ నేతలు పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను జార్ఖండ్ ప్రజలు తిప్పి కొట్టారని విమర్శించారు. బీజేపీ కక్ష సాధింపు విధానాలను ప్రజలు హర్షించడం లేదని తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు.