calender_icon.png 26 November, 2024 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటేదాన్‌లో ఘనంగా మారాఠీ కల్చరల్ ఫెస్ట్

26-11-2024 03:20:53 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణలోనూ మరాఠీ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించేలా మరాఠా మండల్ కొనసాగించడంతో సొంత రాష్ట్రం మహారాష్ట్రలో ఉన్నట్టే ఉందని జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్  సంతోషం వ్యక్తం చేశారు. శ్రీఛత్రపతి శివాజీ మరాఠా కల్చరల్ ట్రస్ట్, తెలంగాణ మరాఠా మండలాల సం యుక్త ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కాటేదా న్ జాలపల్లి మరాఠా భవన్‌లో సోమవారం దసరా ఆత్మీయ సదస్సు జరిగిం ది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేశవ్ పాటిల్.. డివిజన్ స్థాయిలో మారాఠా మండలం ఆధ్వర్యంలో నిర్వహించిన గానం, రచన, నృత్యం, క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు, సంఘంలోని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్క రించారు. మరాఠా మండల అధ్యక్షుడు ప్రకా ష్ పాటిల్ మాట్లాడుతూ.. సమాజాన్ని సం ఘటితం చేసేందుకు దశాబ్దాలుగా మరాఠా మండలం చేస్తున్న కృషిని ప్రస్తావించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దిలీప్ జగ్తాప్, పాచరేలే మదన్ జాదవ్, రామ్ శేరికార్, శంకర్ రావు జాదవ్, హరీష్ కొనాలె, దగ్గు యాదవ్, గజానన్ దేశ్‌ముఖ్, దయానంద్ గోవే తదితరులు పాల్గొన్నారు.