14-03-2025 12:00:00 AM
9 మంది తలలపై రూ. 24 లక్షల రివార్డు
బీజాపూర్, మార్చి 13: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 9 మంది తలలపై రూ. 24 లక్షల రివార్డు కూడా ఉందని పోలీసులు తెలిపారు.
కీలక నేతలు దినేష్ (36), అతడి సతీమణి జ్యోతి అలి యాస్ కళా (32) ఉండగా.. దినేష్ త లపై రూ. 8 లక్షలు, జ్యోతి తలపై రూ. 5 లక్షల రివార్డు ఉందని బీజాపూర్ సీనియర్ ఎస్పీ జితేంద్ర కు మార్ యాదవ్ తెలిపారు. లొంగిపోయిన వారిలో మరో ఆరుగురి తల పై రూ. లక్ష రివార్డు ఉంది.
తాము చేపట్టిన ‘నియా నెల్లనార్ ’ (యువ ర్ గుడ్ విలేజ్) పథకం పట్ల వీరంతా ఆకర్షితులయ్యారని ఎస్పీ తెలిపారు. 2024లో బస్తర్ ఏరియాలో 792 మంది మావోయిస్టులు లొంగిపో గా.. 202 5లో ఇప్పటి వరకు లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య 65. లొంగిపోయిన మావోయిస్టులకు రూ. 25 వేల చొప్పున సహాయం అందించి..పునరావాసం కల్పించినట్లు ఎస్పీ యాదవ్ తెలిపారు.