calender_icon.png 25 April, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14 మంది మావోయిస్టుల లొంగుబాటు

25-04-2025 12:00:00 AM

  1. అందరూ ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారే!
  2. రూ.25 వేల చొప్పున తక్షణ సాయం
  3. నక్సలిజాన్ని వదిలి, కుటుంబంతో గడపండి: ఐజీ

వరంగల్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా కేంద్రం లో గురువారం 14 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారందరూ ఒ డిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందినవారిగా తె లుస్తున్నది. ఆ రెండు రాష్ట్రాల్లో జరిగిన పలు విధ్వంసకర ఘటనలు, పోలీసులపై దాడి ఘటనలు, ఇన్ఫార్మర్ల నెపంతో వ్యక్తులను హత్య చేసిన ఘటనల్లో వీరు పాల్గొన్నట్టు సమాచారం.

లొంగిపోయిన వారిని ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఒక్కొక్క మావోయిస్టుకు రూ. 25 వేల చొప్పన తక్షణ ఆర్థిక సహా యం అందించారు. ఈ సందర్భంగా ఆయ న మా ట్లాడుతూ.. నక్సలిజం మార్గాన్ని వదిలిపెట్టి కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని సూచించారు.

మావోయిస్టులు హింసాయుత విధానాలు విడిచిపెట్టే లా చేయడమే తమ ఉద్దేశం అని చెప్పారు. ఏ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు వచ్చి లొంగిపోయినా జనజీవన స్రవంతిలో ఉపా ధి అవకాశాలు కల్పిస్తామని ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

కాగా లొండిపోయని వారి లో గాలికొండ ఏరియా కమిటీ సభ్యుడు మడవి అంద అలియాస్ రాజేష్, కేంద్ర కమి టీ సభ్యుడు గాజర్ల రవి, ప్రొటెక్షన్ టీం ఏరి యా కమిటీ సభ్యురాలు సోడి కోసి, డివిజన్ కమిటీ సభ్యులు మరకం హిడుమే, మడకం జోగి అలియాస్ కోవాసి జోగి, పోడియం భూమిక అలియాస్ సోడి కోసి అలియాస్ వెన్నెల, సోడి బుద్రి అలియాస్ బద్రి, మడవి పూజే, హేమ్లా సోను, సోడి రమేష్ అలియా స్ భీమా, మిలిషియా సభ్యులు అట్టం బుద్ర, కోవాసి ఇడుమ, కోర్సా లాలు, హేమ్లా సు క్కు , కోర్సా సుక్కు ఉన్నారు.