04-03-2025 12:00:00 AM
వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 3 (విజయక్రాంతి) ః భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట సోమవారం 14 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఆపరేషన్ చేయూత ద్వారా లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ర్ట ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను తెలుసుకొని, ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించి లొంగుబాటు వైపు మావోయిస్టు అడుగులు వేస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను ఎస్పి రోహిత్ రాజు వివరించారు .
చతిస్గడ్ రాష్ట్రానికి చెందినబీజాపూర్ జిల్లా పామేడి గ్రామం కు చెందిన మడవి భీమా (ఎర్ర పల్లి ఆర్ పి సి మిలీషియా కమాండర్), సోడి ఉంగా(ఎర్ర పల్లి ఆర్పేసి సీఎన్‌ఎం అధ్యక్షుడు), మడివి అడుమ (ఎర్ర పల్లి ఆర్టీసీ సిఎన్‌ఎం అధ్యక్షుడు), కుంజాం కోసా(ఎర్ర పల్లి ఆర్పిసి డి ఎ కే యం సభ్యుడు), కోవాసి నంద (కిష్టారం ఏరియా సిఎన్‌ఎం కమాండర్), మడవి భీమా(ఎర్ర పల్లి ఆర్పిసి సిఎన్‌ఎం సభ్యులు), మడవి మాసా(సిఎన్‌ఎం పూజారి కంకేర్, ఆర్ పి సి, చిన్న అవుట్ పల్లి), కుంజాం లక్మా(టైలరింగ్ టీం కమాండర్, దక్షిణ బస్సర్ డివిజన్), వెట్టి లక్కే (పూజారి కంకేర్ ఆర్ పి సి మి లీషియా క్యాడర్), మడవి చుక్కయ్య (పూజారి కంకేర్ ఆర్ పి సి మిలీషియా క్యాడర్), వెట్టి కోసా(పూజారి కంకేర్ ఆర్పిసి సిఎన్‌ఎం సభ్యుడు), మడవి భీమా (పూజారి కంకేర్ ఆర్ పి సిఎన్‌ఎం సభ్యుడు), సోడి రాధికా(పూజారి కంకేర్ ఆర్పిసి మిలీషియా సభ్యురాలు), కుహ్రమి కాజల్(పూజారి కంకేర్ ఆర్పిసి మలేషియా సభ్యురాలు) వీరంతా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అనే విశిస్తున్న వలస ఆదివాసి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కొరకు చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ వెల్లడించారు.
ఈ రెండు నెలల కాలంలో 44 మంది మావోయిస్టులు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయినాడు తెలిపారు. లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే పార్టీ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా, స్వయంగా తమ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో సంప్రదించి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు.