calender_icon.png 12 January, 2025 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోలు జనజీవన స్రవంతిలో కలవాలి

30-12-2024 03:12:37 AM

కోరుట్ల, డిసెంబర్ 28 (విజయక్రాంతి) : మావోయిస్టు లు జన జీవన స్రవంతిలో కల వాలని, వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని మెట్ పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు సూచించా రు. ఆదివారం కోరుట్లలోని మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి ఇంటి కి డీఎస్పీ రాములు, సీఐ సురేష్ బాబు, ఎస్సు శ్రీకాంత్ వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టు నాయకులు అడవిని, ఉద్యమాన్ని విడిచి ఇంటి బాట పట్టాలని డీఎస్పీ హితవు పలికారు. కుటుంబ సభ్యుల  ద్వారా తిరుపతిని లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు.