calender_icon.png 21 March, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దద్దరిల్లిన దండకారణ్యం 30 మంది మావోయిస్టులు హతం

21-03-2025 01:25:33 AM

  1. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకెర్ జిల్లాల్లో భారీ ఎన్‌కౌంటర్లు 
  2. భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ 
  3. ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన డీఆర్‌జీ జవాను 
  4. ఇది భద్రతా దళాల మరో అతిపెద్ద విజయమన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 
      1. ప్రాణాలు కోల్పోయిన జవాను
      2. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు 105 మంది నక్సల్స్ మృతి
      3. 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారత్: షా

రాయ్‌పూర్, మార్చి 20: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకులు మార్మోగాయి. బీజాపూర్, కాంకెర్ జిల్లాల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య గురువారం జరిపిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక జవాను మరణించాడు.

2026 మార్చి 31 నాటికి భారత్‌ను నక్సల్స్ రహిత దేశంగా మార్చే దిశగా చేపట్టిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు మరో అతిపెద్ద విజయాన్ని సాధించాయని కేంద్రహోం మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. బీజాపూర్‌ెేదంతెవాడ సరిహద్దు ప్రాంతంలోని గంగలూరు పోలీస్‌స్టేషన్ పరిధి అండ్రి అడవుల్లో మావోయి స్టులు ఉన్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది.

దీంతో ఛత్తీస్‌గఢ్ టాస్క్ ఫోర్స్ బృందం, డీఆర్‌జీ బృందం సంయుక్తంగా గురువారం ఉదయం కూంబింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 7 గంటలకు భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పు ల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకెర్ జిల్లాలోని కొరొస్కోడో గ్రామ సమీపంలో బీఎస్‌ఎఫ్, డీఆర్‌జీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి 26 మంది మావోయిస్టుల మృతదేహాలను అలాగే కాంకెర్‌లోని ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి మావోయిస్టులకు చెందిన నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెల్లడించారు. 

ఛత్తీస్‌గఢ్‌లో దద్దరిల్లిన దండకారణ్యం

భద్రాద్రి కొత్తగూడెం(విజయక్రాంతి)/ రాయ్‌పూర్, మార్చి 20: ఛత్తీస్‌గఢ్‌లో వేర్వేరు చోట్ల భద్రతా దళాలు గురువారం జరిపిన రెండు ఎన్‌కౌంటర్లలో మొత్తం 30 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక జవాను అమరుడయ్యారు.

బీజాపూర్, కాం కెర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ ప్రదేశాల నుంచి మవోయిస్టులకు చెందిన 30 మృతదేహాలతోపాటు భారీ మొత్తంలో ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి భారత్‌ను నక్సల్స్ రహిత దేశంగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా మద్దతిస్తోంది.

ఈ క్రమంలోనే ఆ రాష్ట్రంలోని దండకారణ్యాన్ని భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజాపూర్- దత్తెవాడ సరిహద్దు ప్రాంతంలోని గంగలూరు అటవీ ప్రాంతంలో పెద్ద మొత్తంలో మావోయిస్టులు ఉన్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో గురువారం ఉదయం టాస్క్‌ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు (డీఆర్‌జీ), సీఆర్‌పీఎఫ్ బృందాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి.

ఈ క్రమంలోనే ఉదయం 7 గంటలకు భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు మొదల య్యాయి. కొన్ని గంటలపాటు జరిగిన ఈ కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మరణించారు. ఎదురుకాల్పుల్లో ఓయం రాజు అనే డీఆర్‌జీ జావాను ప్రాణాలు కోల్పోగా మరో జవాను ఐఈడీ పేలడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ జవానును అధికారులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.

కోల్పోయారు. మరోవైపు కాంకెర్ జిల్లాలోని కొరోస్కోడో గ్రామ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్, డీఆర్‌జీలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో మరో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. గత నెలలో కూడా బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఫిబ్రవరి 9న ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా బలగాలు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో 31 మంది మవోయిస్టులు మరణించారు.

తాజా ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్యతో కలిపి ఇప్పటి వరకు ఈ ఏడాదిలో ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల సంఖ్య 105కు చేరింది. ఇందులో 89 మంది బస్తర్ డివిజన్‌కు చెందిన వాళ్లే ఉన్నారు. 

వారంలో 83మంది మావోయిస్టులు హతం

భారత్‌ను నక్సల్స్ రహిత దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి మావోయిస్టుల ఏరివేతను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆయుధాలతను వినియోగిస్తూ మావోయిస్టు స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లొంగిపోవా లనుకునే మావోయిస్టులకు ‘ఆపరేషన్ చేయూత’ పేరుతో పునరావాస సౌకర్యాలను కల్పిస్తోంది. దీంతో ఆయుధాలు చేతబట్టి, అడవిబాట పట్టిన మావోయిస్టులు నేడు జనజీవన స్రవంతివైపు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో భ్రద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేవలం వారం వ్యవధిలోనే 83 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఈనెల 15న మల్టీజోన్-1 డీఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఎదుట వివిధ క్యాడర్లకు చెందిన 64 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అలాగే 17వ తేదీన మరో 19 మంది ఎస్పీ రోహిత్‌రాజు ఎదుట లొంగిపోయారు. దీంతో వారం వ్యవధిలో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఛతీస్‌గఢ్ మావోయిస్టుల సంఖ్య 83కు చేరింది.

ఇది మరో అతిపెద్ద విజయం

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన తాజా ఎన్‌కౌంటర్‌ను నక్సల్స్ రహిత భారత్‌ను రూపొం దించే ఆపరేషన్‌లో భద్రతా దళాలు సాధించిన మరో అతిపెద్ద విజయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. ఎన్‌కౌంటర్‌పై ఎక్స్ వేదికగా షా స్పందించారు. ‘అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ కొందరు మావో యిస్టులు లొంగిపోవడం లేదు.

భారత్‌ను నక్సల్స్ రహిత దేశంగా మార్చే క్రమంలో లొంగిపోవడానికి నిరాకరిస్తున్న మావోయిస్టుల పట్ల ప్రధాని నరేం ద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. 2026 మార్చి 31 నాటికి దేశం పూర్తిగా  నక్సల్స్ రహితంగా మారుతుంది’ అని తన పోస్ట్‌లో షా పేర్కొన్నారు.

గత నెలలో జరిగిన ఎన్‌కౌంటర్ సందర్భంగానూ షా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించి, మావోయిస్టుల వల్ల దేశంలోని ఏ ఒక్క పౌరుడూ ప్రాణాలు కోల్పోకుండా చూడటమే తమ కర్తవ్యమని వెల్లడించారు.