calender_icon.png 28 April, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టులూ భారత పౌరులే..

28-04-2025 12:23:48 AM

  1. సొంత బిడ్డలను చంపుకోవడం తగదు
  2. వారితో కేంద్రం చర్చలు జరపాలి
  3. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): మావోయిస్టులూ భారతదేశ పౌరులేనని, సొంత బిడ్డలను చంపుకోవడం కేంద్ర ప్రభుత్వానికి తగదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం వారితో చర్చలు జరపాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల సమస్యను శాంతిభద్రత సమస్యగా కాకుండా సామాజిక, రాజకీయ సమస్యగా చూసి వారిని చర్చలకు పిలవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. కాల్పులు విరమిస్తే తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని గతంలో ఎప్పుడూ లేని విధంగా మావోయిస్టులు ప్రకటించడం మంచి పరిణామమన్నారు.

మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడి ప్రజల్లోకి వచ్చి రాజ్యాంగ, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి భేషిజాలకు పోకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలన్నారు. దండకారణ్యం, కర్రె గుట్టల్లో సాగుతున్న భద్రతా దళాల ఆపరేషన్‌ను నిలిపివేయాలని ప్రధాని మోదీనికి విజ్ఞప్తి చేశారు.