- స్వచ్ఛందంగా సరెండరయిన 19 మంది వివిధ క్యాడర్ల దళసభ్యులు
- జిల్లాలో ఫలిస్తున్న ఆపరేషన్ చేయూత ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడి
భద్రాచలం, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 19 మంది మావోయిస్టు పార్టీ దళ సభ్యులు బుధవారం నాడు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సమక్షంలో భద్రాచలం ఎస్పీ కార్యాలయం నందు లొంగిపోయారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరియు 81 మరియు 141 బెటాలియన్, సీఆర్‌పీఎఫ్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృ ద్ధి సంక్షేమం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ‘ఆపరేషన్ చేయూత’ కార్యక్రమం ద్వారా గతంలో చర్లలో లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణ గురించి తెలుసుకుని ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవితం గడపాలని ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన మావోయిస్టు పార్టీ వివిధ క్యాడర్లకు చెందిన 19 మంది మావోయిస్టులు ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులకు వారి కుటుంబ సభ్యులకు రాష్ర్ట ప్రభుత్వం తరపున వచ్చే ప్రోత్సాహక పథకాలు వారికి అందిస్తా మని తెలిపారు. ఈ సందర్భంగా గతనెలలో లొంగిపోయిన ఏసీఎం క్యాడర్ మావోయిస్టు పార్టీ దంపతులకు రాష్ర్ట ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల చెక్కును ఎస్పీ రోహిత్ రాజ్ అందచేశారు. ఈ కార్యక్రమంలో సిటీ సీఆర్‌పీఎఫ్ అధికారులు భద్రాచలం మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి పోలీసు అధికారులు పాల్గొన్నారు.