calender_icon.png 6 October, 2024 | 5:52 AM

మావోయిస్టు కార్యదర్శి ఎన్‌కౌంటర్?

06-10-2024 01:43:03 AM

ఛత్తీస్‌గఢ్ మృతుల్లో నంబాల కేశవరావు?

మరో అగ్రనేత వాసుదేవరావు ఉన్నట్లు సమాచారం

కొందరి వివరాలే తెలిపి గోప్యత

1,500 మంది బలగాలతో ఆపరేషన్

25 కి.మీ. కఠినమైన మార్గంలో ప్రయాణం

రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), అక్టోబర్ 5: ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మాడ్ దండకారణ్యంలో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు తెలిసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు కూడా చనిపోయినట్లు స్థానిక గిరిజ నులు చెప్తున్నారు.

మరో అగ్రనేత తెక్కెళ్లపల్లి వాసుదేవరావు కూడా మరణించాడని అం టున్నారు. అయితే, పోలీసులు మాత్రం మృతులందరి వివరాలు వెల్లడించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని వివరాలు బయటపెట్టలేమని బస్తర్ రేంజ్ ఐజీ ప్రకటించటం మృతుల్లో పార్టీ అగ్రనేతలు ఉన్నా రన్న అనుమానాలను బలపరుస్తున్నది.

ఈ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు చనిపోగా, వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ నేత కమలేశ్, మరో అగ్ర నేత ఊర్మిళ పేర్లను మాత్రమే బయటపెట్టారు. కమలేశ్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కాగా, ఊర్మిళది కర్ణాటకలోని బీజాపూర్ ప్రాంతం. మృతుల్లో 16 మంది మహిళా మావోయిస్టులున్నారు. 

12 కిలోమీటర్లు కొండలు ఎక్కి కాల్పులు

కొంతకాలం క్రితం వరకు అబూజ్‌మడ్‌లోకి అడుగుపెట్టలేకపోయిన భద్రతాబల గాలు ఇప్పుడు అణువణువూ గాలిస్తున్నా యి. శుక్రవారం నాటి ఎన్‌కౌంటర్‌లో ఏకం గా 1500 మంది వివిధ విభాగాలకు చెందిన స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొనటం గమనార్హం. వీరంతా దట్టమైన అడవిలో 25 కిలో మీటర్ల ప్రయాణించి మావోయిస్టులను ఏరివేశారు. భద్రతా బలగాలు 10 కిలోమీటర్లు బైకులపై, మరో 12 కి.మీ కాలనడకన కొండలెక్కి క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించాయి.  

5 రాష్ట్రాల్లో వీళ్లు మోస్ట్ వాంటెడ్

కమలేశ్, నీతి దండకారణ్య ప్రత్యేక జోన ల్ కమిటీ (డీకేఎస్‌జెడ్‌సీ)లో కీలక వ్యక్తులు గా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అతను ఐటీఐ విద్యార్థి. కమలేశ్ ప్రధానంగా నార్త్ బస్తర్, తెలంగాణలోని నల్లగొండ, బీహార్‌లోని మన్పూర్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో క్రియాశీలంగా పనిచేశాడు. ఊర్మిళ మావోయిస్టు ప్రచార యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. కమలేశ్, ఊర్మిళ కోసం 5 రాష్ట్రాల్లో వీరిద్దరి కోసం వెతుకున్నారు. ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రలో వీరి ప్రభావం ఉంది.

వారిపై రూ.౧.౩౦ కోట్ల రివార్డు

బస్తర్ రేంజ్ ఐడీ సుందర్‌రాజ్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. మృతుల్లో ౧౬మందిపై రూ.౧.౩౦ కోట్ల రివార్డు ఉంది. ఊర్మిళపైనే రూ.౨౫ రివార్డు ఉంది. తూర్పు బస్తర్‌కు ఆమె నాయకత్వం వహిస్తోంది. మరో ఇద్దరు కీలక నేతలు సురేశ్, మీనాపై రూ.౮ లక్షల చొప్పున రివార్డు ఉంది. ఎన్‌కౌంటర్ లో మరణించినవారిలో ౧౩ మంది మహిళలు ఉన్నారు. అని తెలిపారు. 

సిట్టింగ్ జడ్జితో విచారించాలి

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘాలు స్పందించాయి. మృతుల ఫొటోలు, వివరాలను వెంటనే విడుదల చేయాలని ఏపీ పౌర హక్కుల సంఘం కోరింది. మృతుల్లో మావోయిస్టు కార్యదర్శి నంబళ్ల కేశవరావు, మరో అగ్రనేత తక్కెళ్లపాడు వాసుదేవరావు కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయని, అందువల్ల వెంటనే వివరాలు బయటపెట్టాలని ఏపీసీఎల్‌సీ నేతలు కోరారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 

6 నెలల్లో 3 ఎన్‌కౌంటర్లు

తాజా ఎన్‌కౌంటర్‌తో బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాది మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 188కి చేరింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న కాన్‌కేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మరణం తర్వాత మావోయిస్టులకు ఇదే పెద్ద ఎదురుదెబ్బ. కాన్‌కేర్ ఎన్‌కౌంటర్ లో 15 మంది మహిళలు సహా డివిజనల్ స్థాయి నాయకులు ఉన్నారు.

వీరిపై రూ.8 లక్షల రివార్డు కూడా ఉంది. తర్వాత ఆగస్టు 29న కాన్‌కేర్‌లోనే జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఏడాది వానకాలంలో బస్తర్‌లో 212 మందికిపైగా నక్సల్స్‌ను అరెస్టు చేశారు. 201 మంది లొంగిపోయారు. ఇది మావో ఉద్యమంలో క్షీణతను సూచిస్తోంది.   

ఆపరేషన్ ఎలా జరిగింది?

అబూజ్‌మాడ్ అడవిలో ఇంద్రావతి ఏరియా కమిటీ, పీపుల్స్ లిబరేషన్ గెరి ల్లా ఆర్మీ కంపెనీ నంబర్ 6కు చెందిన కీలక వ్యక్తులతో సహా 50 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ప్రాంతంలో కమలేశ్, ఊర్మిళ, నందు అనే మరో వాం టెడ్ కమాండర్ ఉన్నట్లు తెలిసింది.

దీంతో జిల్లా రిజర్వ్ గార్డ్స్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి అదనపు బలగాలు కలిసి మొత్తం 1,500 మందితో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి. పక్కా వ్యూహంతో రెండు రోజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్ గురించి దంతెవాడ ఏఎస్పీ ఆర్కే బర్మన్ పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడించారు.

గవాడి, థుల్‌థులి, నెందూర్, రెంగవయా గ్రామాల్లో నక్సల్స్ ఉన్నట్లు వచ్చిన సమాచారాన్ని రూఢీ చేసుకుని అక్టోబర్ 3 ఉదయమే ఆపరేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. ఆపరేషన్ కోసం దండకారణ్యంలో 25 కిలోమీటర్లు కఠినమైన మార్గంలో ప్రయాణించాల్సి ఉంది.

మావోయిస్టుల కంటపడకుండా ఎత్తున కొండ ప్రాంతానికి చేరుకునేందుకు 10 కిలోమీటర్ల మేర బైక్‌లపై ఆ తర్వాత 12 కిలోమీటర్లు కాలినడనక వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. చీకటి పడేవరకు కాల్పులు కొనసాగాయి  అని బర్మన్ వివరించారు.