16-04-2025 12:49:11 AM
చర్ల, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దు గల చత్తీస్గడ్ రాష్ట్రం మన్పూర్ జిల్లాలో రూ 5 లక్షల రివార్డ్ కలిగిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు రూపేష్ మంగళవారం పోలీసులు ఎదుట లొంగిపోయాడు. లొంగిపోయిన మావోయిస్టు రూ పేష్ మాండవి ఆర్కెబి డివిజన్ కోటారి ఏరియా కమిటీ సభ్యుడు. ప్రభుత్వ కల్పించిన కొత్త పునరావాస విధానంతో పోలీసుల వద్ద లొంగిపోయాడు.
మావోయిస్టు సంస్థ నుండి నిరాశ, సంస్థలో అంతర్గత వ్యత్యాసాల వలన లొంగిపో పోయినట్లు రుపేష్ మాండవి అలియాస్ సుఖ్దేవ్ పోలీసులకు తెలిపారు. ఆయన కోటారి ప్రాంత కమిటీలో డిప్యూటీ కమాండర్ గా పనిచేశారు.అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ మదన్వారా, సీతాగావ్, ఆండి, మాన్పూర్, నారాయణ్పూర్లోని మాడ్ ఏరియా, గోండహూర్, పఖంజుర్ మాడ్ అటవీ ఏరియాలలో జరిగిన వివిధ మావోయిస్టు కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు.
పోలీసులు విజయం సాధిస్తున్నారు: జిల్లా ఎస్‌పీవైపీ సింగ్
ఈ సందర్భంగా పోలీసు సూపరింటెండెంట్ వైపి సింగ్ మాట్లాడుతూ, లొంగిపోయిన మావోయిస్టు 2012 లో మావోయిస్టు సంస్థతో సంబంధం కలిగి ఉన్నాడని, మావోయిస్టు సంస్థలో 14 సంవత్సరాలు పనిచేసిన తరువాత లొంగిపోయినట్టు తెలిపారు.
రూపేష్ లొంగిపోవటం ద్వారా మావోయిస్టు ఉద్యమం కోసం పనిచేసే వారి వివరాలు తెలుస్తున్నాయని, మావోయిస్టు లు భారీగా లొంగిపోవడంతో మూవీస్ వ్యవస్థ బలహీన పడుతుందన్నారు. పోలీసులు జిల్లాలోని మావోయిస్టులను లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో మొహ్లా-మన్పూర్ జిల్లాలను మావోయిస్టు రహిత జిల్లాలుగా ఉండేలా గుడిలో కృషి చేస్తున్నామని తెలిపారు.