calender_icon.png 25 April, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండిపోర్ లో ఎదురుకాల్పులు.. ఇద్దరు జవాన్లకు గాయాలు

25-04-2025 10:16:31 AM

శ్రీనగర్,(విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోర్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. బండిపోరా జిల్లాలోని కుల్నార్ బాజిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని అధికారులు పేర్కొన్నారు. దాక్కున్న ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపిన తర్వాత, గాలింపు చర్య ఎన్‌కౌంటర్‌గా మారిందన్నారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, మరిన్ని వివరాలు అందజేయాలని అధికారులు తెలిపారు.