24-03-2025 01:10:05 AM
భారీగా ఆయుధాలు, ఇతర సామగ్రి లభ్యం
చర్ల, మార్చి 23 (విజయ క్రాంతి): చర్ల సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లా మెటగుడ పోలీస్ స్టేషన్ చింతగుఫా సుక్మా మార్కన్గూడ, మెటగుడ అటవీ కొండల వద్దగల మావోయిస్టుల డంపును భద్రతా బలగాలు ఆదివారం స్వాధీనం చేసుకున్నాయి. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంలో భద్రతా దళాలు విజయం సాధించాయి.ఒకవైపు మావోయిస్టుల ఏరివేత, మరోవైపు వారి స్థావరాలను స్వాధీనం చేసుకోవడంతో మావోయిస్టు ఉనికిని భారీగా దెబ్బతీస్తున్నారని చెప్పవచ్చు.భద్రతా దళాలపై భారీ దాడి చేయాలనే పథకంలో భాగంగా మావోయిస్టులు మందు గుండు సామాగ్రి పదార్థాన్ని నిల్వ చేశారు.
మావోయిస్టు డంపు నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు వివరాలు: భార్మార్ (సింగిల్ బ్యారెల్) 06 BGL (బారెల్ గ్రెనేడ్ లాంచర్) 18 (లైవ్) అమ్మీటర్ - 01 డిటోనేటర్ - 06 బెల్ట్ - 01 స్లింగ్ - 01 బెల్ట్ (నలుపు) - 01 యూనిఫాం (నలుపు) - 01బ్యాక్ప్యాక్ - 02 పౌచ్ - 02 బ్యాటరీ ఛార్జర్ - 01 సెమీకండక్టర్ సర్క్యూట్ - 02 BGL కార్ట్రిడ్జ్ - 09 ఇనుప గుళికలు సోల్డరింగ్ వైర్ నక్సల్ సాహిత్యం మందులు 10 నాట్లతో కోడెక్స్ వైర్ (20 సెం.మీ) . యాం టెన్నా పరికరం. 12 బోర్ రైఫిల్ - 02 ముక్కలు కంట్రీ మేడ్ రైఫిల్ - 01 ముక్క ముడి వేసిన కార్డెక్స్ వైర్ - 0.5 మీటర్ సేఫ్టీ ఫ్యూజ్ - 08 మీటర్ . BGL రౌండ్ - 02 ముక్కలు కార్ట్రిడ్జ్ (కంట్రీ మేడ్) - 10 ముక్కలు దేశీ డిటోనేటర్ - ముక్కలు గన్ పౌడర్ - 100 గ్రాములు దేశీ బాంబ్ - 01 ముక్క మందుగుండు సామగ్రి పౌచ్ - 02 ముక్కలు కంబాట్ బ్యాక్ప్యాక్ - 01 ముక్క ఐరన్ యాంగిల్ - 50 ముక్కలు స్టీల్ పైప్ (BGL తయారీలో ఉపయోగించే పొడవు 02 అడుగులు) - 01 నం. U టైప్ ఐరన్ యాంగిల్ - 30 నం. 02 పిన్ ఎలక్ట్రిక్ సాకెట్ - 20 నం. సివిల్ డ్రెస్ - 01 జత బెడ్షీట్ - 01 నం. నక్సల్ జెండా - 01 నం. మిక్సర్ జార్ - 01 నం. నట్స్/బోల్ట్లు - 10 కిలోలు మావోయిస్టు పేర్లు పదార్థాలు సాహిత్యం పోలీసులు స్వాధీన పరుచుకున్నారు