calender_icon.png 13 March, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు డంప్ స్వాధీనం

10-03-2025 12:12:34 AM

మావోయిస్ట్ ప్రింటింగ్ ప్రెస్ స్థావరాలపై భద్రతా బలగాలు దాడి

 చర్ల, మార్చి 9 (విజయక్రాంతి) : చర్ల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా అడవులలో పోలీసులే లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఘాతకానికి వడి కట్టారు, సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో మావోయిస్టు నిర్మూలన కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో నూతన  క్యాంప్ గోమ్గూడ పరిధిలోని జలేర్గూడ గ్రామ అటవీ  మావోయిస్టులు  ఉన్నారనే సమాచారంతో, జిల్లా పోలీసు దళం, 203 కోబ్రా కారప్స్, బి/వైపి/241 కారప్స్ సిఆర్పిఎఫ్ జలేర్గుడాల్ ఫారెస్ట్ పరిధిలోని జలేర్గుడాల్ అటవీప్రాంతం నుండి శనివారం బయలుదేరింది  జలేర్గూడ గ్రామంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, గుర్తుతెలియని మావోయిస్టులు హాని కలిగించే ఉద్దేశ్యంతో రహస్య స్థావరం చుట్టుపక్కల  పలు ప్రాంతాలలో  స్పుక్లు అమర్చి, ప్రింటర్లను సురక్షితంగా దాచిపెట్టినట్లు సమాచారంతో  భద్రత బలగాలు మావోయిస్టులు వాడే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.  సైనికులందరూ సురక్షితంగా ఈ ఆపరేషన్ ముగిసిన తర్వాత అన్ని పార్టీలు సురక్షితంగా శిబిరానికి చేరుకున్నాయి.

పోలీసులు స్వాధీనం చేసుకున్న పరికరాలు

 లేజర్ ప్రింటర్ -1 , ఇన్వర్టర్-1 ,  ఎలక్ట్రికల్ వైర్ సుమారు 10 మీటర్లు,  కాలిక్యులేటర్-1 , ప్రింటర్ కేబుల్-2,  ఇన్వర్టర్ కేబుల్-1 ,  రిమోట్- 2,  3 పిన్ (ట్రాన్సిస్టర్) - 90,  ‘మగ స్త్రీ‘ కనెక్టర్ 40,   జామెట్రీ బాక్స్-1,  సీడీ 2   సోల్డరింగ్ ఐరన్ - 01,  వుడెన్ స్పుక్స్ - 150,  ఐరన్ స్పుక్స్ - 90,    బ్యాటరీ పిన్ - 01,   ఇనుప స్పుక్ ఉన్న చెక్క - 15,    బెల్ట్-01,   సోలార్ బ్యాటరీ - 01,  ఇవే కాక మావోయిస్టులు వాడే  రోజువారీ వస్తువులను కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.