భద్రాద్రి కొత్తగూడెం, జూలై 24 (విజయక్రాంతి): మావోయిస్టు డిప్యూటీ కమాండర్ కారం సమ్మయ్యను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి వైర్ బండిల్స్ స్వాధీనం చేసుకొన్నట్టు ఏఎస్పీ అంకిత్‌కుమార్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కు వివరాలను వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్ల చర్ల పరిధిలోని తాలిపేరు లెఫ్ట్ కెనాల్ వద్ద సీఆర్పీఎఫ్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తంగా వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో తప్పించుకొనేందుకు పారిపోతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు.
చర్ల మండలం కలివేరు గ్రామ పరిధిలోని రాజుపేటకు చెందిన కారం సమ్మయ్యగా గుర్తించారు. గత ఆరు సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీ కొరియర్‌గా పనిచేస్తున్నట్టు సమ్మయ్య అంగీకరించాడని చెప్పారు. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాలు ఉన్నందున, పోలీసులను మట్టుబె ట్టేందుకు పేలుడు సామగ్రిని తీసుకురమ్మ న్న మావోయిస్టు నాయకుల ఆదేశాను సమ్మయ్య వాటితో వెళ్తూ పట్టుబడినట్టు ఏఎస్పీ వెల్లడించారు.