calender_icon.png 8 October, 2024 | 5:55 AM

తుది దశకు మావోయిజం

08-10-2024 03:17:47 AM

నక్సల్ రహిత దేశంగా మార్చడమే మా లక్ష్యం

  1. ఈ ఏడాది 202 మంది నక్సల్స్ మృతి
  2. ఛత్తీస్‌గఢ్ విజయం అందరికీ స్ఫూర్తి
  3. పథకాల ఫలాలు ప్రజలందరికీ చేరాలి 
  4. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: దేశంలో మావోయిస్టు తీవ్రవాదం చరమదశకు చేరుకుం దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలపై కేంద్రం దృష్టిపెట్టిందని, మావోయిస్టు తీవ్రవాదం అంతం కోసం అన్ని రాష్ట్రాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మావోయిస్టు ప్రభా విత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. భారత్‌లో మావోయిస్టు తీవ్రవాదం అంతిమదశకు చేరుకుంది. నక్సల్స్ కదలికలు ఉండే రాష్ట్రాలపై కేంద్రం దృష్టిపెట్టింది. ఇప్పటివరకు 13 వేల మందికిపైగా మావోయి స్టులు ఆయుధాలు వదిలిపెట్టారు.

ఈ ఏడాది 202 మంది నక్సల్స్ మృతిచెందారు. 723 మంది లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. ఇకముందు మరింత స్ఫూర్తితో ఒకే లక్ష్యంతో ముందుకెళ్లాలి. ఛత్తీస్‌గఢ్ విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తోంది. అక్కడ అందరు నక్సల్స్ లొంగిపోయారు అని అమిత్ షా వివరించారు. 

అన్ని రాష్ట్రాలు సహకరించాలి

దేశాన్ని మావోయిస్టుల రహితంగా మార్చేందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని అమిత్‌షా పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ సందర్భంగా పదేళ్లలో మోదీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. పదేళ్లలో 11,500 కిలోమీటర్ల రోడ్ నెట్‌వర్క్, 15 వేల మేర సెల్‌ఫోన్ టవర్లు ఏ ర్పాటు చేసినట్లు చెప్పారు.

165 ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు నిర్మించి నట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ విజయం పై ఆ రాష్ట్ర సీఎం, డీజీపీని అమిత్ షా అభినందించారు. దేశంలో హిం సాత్మక ఘటనలు భారీగా స్థాయిలో తగ్గినట్లు వివరించారు.  దేశంలో హింసాత్మక ఘటనలు గతంలో 16 వేలకుపైగా జరిగితే ప్రస్తుతం వాటి సంఖ్య 7 వేలకు పడిపోయింది.

ప్రజ లు, భద్రతా దళాల మరణాలు 70 శాతం తగ్గాయి. హింస ప్రభావిత జిల్లాలు 96 నుంచి 42కు వచ్చాయి. గతంలో 465 పోలీస్‌స్టేషన్లు హిం సాత్మక ఘటనల పరిధిలోకి రాగా ప్రస్తుతం వాటి  సంఖ్య కూడా 171కి తగ్గింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకారం వల్లనే ఇది సాధ్యమైంది అని అమిత్ షా పేర్కొన్నారు.