calender_icon.png 30 October, 2024 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎస్‌కు పలువురి నివాళి

08-07-2024 03:38:59 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (విజయక్రాంతి) : ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) సంతాప సభ నగరంలోని సంధ్య కన్వెన్షన్‌లో ఆదివారం జరిగింది. పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై డీఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు. డీఎస్ కుటుంబసభ్యులను పరామర్శించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు తదితరులు నివాళులర్పించారు.