calender_icon.png 22 February, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ దాడులతో దెబ్బతింటున్న ఎన్నో వ్యవస్థలు

18-02-2025 01:46:56 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): హెచ్ఐసీసీలో మంగళవారం, బుధవారం షీల్డ్-2025 సదస్సు(SHIELD-2025 Summit) జరుగుతుంది. షీల్డ్-2025 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో సైబర్ సెక్యూరిటీ నిపుణులు(Cyber ​​Security Experts), ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(IT and Industries Minister Sridhar Babu), ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సైబర్ నేరాలకు పరిష్కారాలు కనుగొనడమే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... సాంకేతికతతో మరిన్ని అవకాశాలు లభిస్తాయని, డీప్ ఫేక్, ర్యాన్సమ్ వేర్, మాల్ వేర్ వంటి సవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. సాంకేతికత రెండువైపులా పదును ఉన్న కత్తిలాంటిదన్నారు.  సైబర్ దాడుల వల్ల ఎన్నో వ్యవస్థలు దెబ్బతింటున్నాయన్నారు.

ఇటీవల ఎయిమ్స్ పై సైబర్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికాలో జరిగిన సైబర్ దాడితో విమాన రాకపోకలు స్తంభించాయన్నారు. సైబర్ నేరాల(Cyber Crimes) వల్ల రూ.15 వేల కోట్ల భారతదేశం నష్టపోతుందని, పరువు పోతుందని చాలా మంది సైబర్ నేరాల గురించి చెప్పట్లేదని అభిప్రాయ పడ్డారు. సాంకేతికతలో సామర్థ్యం పెంచుకోవడమే సమస్యలకు పరిష్కారమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతతో స్కిల్ వర్సిటీ ఏర్పాటైందని, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఆయన గుర్తు చేశారు. మన జీవితాల్లో ఏఐ కీలకపాత్ర పోషించబోతోందని, వన్ గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.