calender_icon.png 4 February, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికటించిన మధ్యాహ్న భోజనం..

29-01-2025 10:53:47 PM

16 మంది విద్యార్థుల అస్వస్థత..

పలువురు ఆసుపత్రిలో చేరిక..

కామారెడ్డి (విజయక్రాంతి): మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, అందులో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రోజువారి వలె విద్యార్థులకు వంట ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం వండి పెట్టారు. అది తిన్న గంట తర్వాత విద్యార్థులకు కడుపునొప్పి వికారం తదితర ఇబ్బందులు ఎదురయ్యాయి.

విద్యార్థులు తమ ఇబ్బందుని ఉపాధ్యాయ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే వారు అస్వస్థకు గురైన విద్యార్థులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 16 మంది విద్యార్థులకు ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించారు. సాయంత్రానికి కోలుకున్న పలువురు విద్యార్థులను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు. ముగ్గురు విద్యార్థులు మాత్రం ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నట్లు సమాచారం. వంట ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్నం వండిన టమాట కూరలో లోపం వల్లే ఇది జరిగినట్లు తెలుస్తోంది. టమాటా కూర తిన్న తర్వాతే విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురైనట్లు విద్యార్థులు చెబుతున్నారు. టమాట కూరలో లోపం వల్లే ఇది జరిగి ఉండొచ్చని విద్యార్థులు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.