10-02-2025 07:17:02 PM
మంచిర్యాల (విజయక్రాంతి): బహుజన్ సమాజ్ పార్టీలో బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి కాదాసి రవీందర్, చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ ల ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు చేరారు. సోమవారం బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యకర్తల సమావేశంలో మునుముందు చేపట్టే కార్యక్రమాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సింగతి రంగనాథ్, వేముల వీరేందర్, దాగం శ్రీనివాస్, గాజుల శంకర్, ఎండి మతిన్ ఖాన్, రామిల్ల రాజేష్, కొంకటి రవీందర్, మడిపెల్లి రాములు, కుమ్మరి కృష్ణ చైతన్య, దుర్గం శివ కుమార్, దుగుట రాకేష్, మంతెన రవివర్మ తదితరులు పాల్గొన్నారు.