07-04-2025 06:39:53 PM
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నస్రుల్లాబాద్ మండలంలో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నస్రుల్లాబాద్ మండలం అంకోల్, దుర్కి, అంకోల్ తండా తదితర గ్రామాల్లో సోమవారం కల్తీ కల్లు తాగిన పలువురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కల్లు తాగి అస్వస్థతకు గురైన వారు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.