పలు గ్రామాల రైతులు, పలు సంఘాల ఎమ్మార్పీఎస్ నాయకుల సంఘీభావం...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు యువ రైతు శ్రీకాంత్ రెడ్డి సోమవారం అర్ధరాత్రి నుంచి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మంగళవారం, బుధవారం పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన శ్రీకాంత్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాగయ్యలు మద్దతు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు రైతు శ్రీకాంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు పూలమాలవేసి దీక్షకు మద్దతు తెలిపారు. అడ్లూరు ఎల్లారెడ్డి టేక్ రియల్ ఎలిజిపూరు గ్రామాల రైతులు బుధవారం మంచి పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. శ్రీకాంత్ రెడ్డి దీక్షకు తమ మద్దతు ఉంటుందని గతంలో లాగా ఉద్యమం చేపడతామని రైతులు అంటున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.భాగయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో వ్యవసాయ భూముల నుండి ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్ ఎత్తివేస్తామని చెప్పారని కానీ అది అధికారికంగా జీవో కాపీ ప్రకటించలేదని అప్పుడున్న ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి రాగానే అధికారికంగా ప్రకటించి రద్దు చేసి జీవో కాపీని రైతులకు ఇస్తామని చెప్పారని అది ఇంతవరకు అమలు చేయడం లేదని, మున్సిపల్ పరిధిలోని 8 విలీన గ్రామాలు 1195 ఎకరాల భూమి రైతులు ఆందోళన చెందుతున్నారని రైతు శ్రీకాంత్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలపడం జరిగిందని వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేస్తున్నట్లు అధికారికంగా జీవో కాపీ జారీ చేయాలని లేకపోతే మా ఎమ్మార్పీఎస్ పక్షాన రైతు శ్రీకాంత్ రెడ్డి ఆమరణ దీక్షకు రైతులకు మద్దతుగా ఉంటామని తెలిపారు. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పలు యువజన సంఘాల ప్రతినిధులు రైతులు పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. ధర్మ సమాజ్ పార్టీ ప్రతినిధులు పాల్గొని మద్దతు తెలిపారు. 1193 ఎకరాలకు సంబంధించి 500 పైకి చిలుకు రైతుల ప్రయోజనంకు సంబంధించిన పోరాటానికి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.