calender_icon.png 26 December, 2024 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో ఎన్నో అనుమానాలు

26-12-2024 12:46:41 AM

  1. సినీ పరిశ్రమ ఏపీకి వెళ్తే తెలంగాణకు నష్టమే
  2. రాహుల్ గాంధీకి అంబేద్కర్ పంచ తీర్థాలు తెలుసా?
  3. చిట్‌చాట్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమ ఆంధ్రాకు పోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలితే తెలంగాణకే నష్టమని..

మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకుం డా ఆ పార్టీ అధిస్ఠానం వారిని అదుపులో పెట్టుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కాంగ్రెస్ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని..

రేవంత్‌రెడ్డికి అంబేద్కర్‌పై నిజంగా ప్రేమ ఉందా? ఉంటే ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తాళాలు ఎందుకు వేశారని నిలదీశారు. అంబేద్కర్ చరిత్ర తెలిపేలా ఉన్న గదుల్లోకి వెళ్లనివ్వడం లేదని మండిపడ్డారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహన్ని సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి ఒక్కసారి కూడా సందర్శించలేదన్నారు.

బీజేపీ ఒత్తిడి మేరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం నిర్మాణాన్ని పూర్తి చేసిందని గుర్తు చేశారు. బీజేపీకి దళితుల మద్దతు ఉంది కాబట్టే వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. దళితుల విశ్వాసం కోల్పోయినందుకే కాంగ్రెస్‌కు కనీసం వంద సీట్లు కూడా రాలేద న్నారు.

రాహుల్‌గాంధీకి అంబేద్కర్ పంచ తీర్థాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఆయనపై రాహుల్‌కు ఏ మాత్రం ప్రేమ ఉన్నా ముందు వాటిని సందర్శించాలని సంజయ్  సూచించారు.

తెలుగు వారి పాత్ర గొప్పది

  1. అల్లు అర్జున్ వివాదాన్ని ఇంతటితో ముగించాలి
  2. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): ఇండియన్ సినిమాలో తెలుగు నటుల పాత్ర ఎంతో గొప్పదని మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. సినీ నటుల ఖ్యాతిని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని.. అది మంచి పద్ధతి కాదని సూచించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ సినీ పరిశ్రమకు ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, బాహుబలి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చాయ న్నారు. మోదీ ప్రభుత్వం అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు, చిరంజీవికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఇచ్చి గుర్తించదన్నారు.

రాజకీయాలు మానుకుని అల్లు అర్జున్ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి సూచించారు.