calender_icon.png 3 February, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయిని పట్టుకున్న మణుగూరు పోలీస్..

29-01-2025 10:32:04 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని సురక్ష బస్టాండ్ వద్ద బుధవారం మణుగూరు పోలీసులు గంజాయి పట్టుకున్నారు. సీలేరు నుంచి మణుగూరు మీదుగా హైదరాబాద్ కు తరలిస్తుండగా డాగ్ స్క్వాడ్ తనిఖీల్లో ఈ గంజాయిని పట్టుకున్నారు. దానం శశి కృష్ణ అనే వ్యక్తిని మణుగూరు ఎస్సై రంజిత్ అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలంలో పంచనామా నిర్వహించి గంజాయితో పాటు ముద్దాయిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.