calender_icon.png 27 February, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్ లైసెన్స్‌తో మందుల తయారీ!

27-02-2025 01:51:31 AM

కేసు నమోదుచేసిన డ్రగ్ కంట్రోల్ అథారిటీ

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : లైసెన్సులు మాత్రం సాధారణ ఆహార పదార్థాలు తయా రు చేసేందుకు.. చేస్తున్నది మాత్రం ఔషధాల తయా రీ!. నగరంలోని ముషీరాబాద్‌లో జరుగుతున్న తంతు ఇది. వారు తయారుచేస్తున్నది కూడా నకిలీ ఔషధాలు కావడం ఇక్కడ విశేషం. ఇలాంటివారిపై డ్రగ్ కంట్రోల్ అధికారులు బుధవారం దాడులు జరిపి కేసులు నమోదు చేశారు.

ఫోరా న్- ఎక్స్, ఫోలిక్ యాసిడ్, జింక్ సల్ఫేట్ పేరిట తయారుచేసిన నకిలీ ఔషధాలను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. ఫుడ్ ప్రొడక్ట్స్ పేరిట వీటిని తయారుచేసి విక్రయిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చెంగిచర్లకు చెందిన మ్యాక్స్ ట్రా లేబరేటరీస్, మార్కెటింగ్ చేస్తు న్న అశోక్‌నగర్‌కు చెందిన జైవ్ ఫార్మాస్యూటికల్స్‌పై కేసులు నమోదుచేశారు. 

తప్పుడు ప్రకటనలు 

షుగర్ వ్యాధిని తగ్గిస్తుందని పేర్కొంటూ పొడపత్రి పౌడర్, కిడ్నీలో రాళ్లను కరిగిస్తుందంటూ స్టోన్ గో ఆల్కలైజర్ సిరప్ లాంటి నకిలీ ఔషధాల పేరిట తప్పుడు ప్రకటనలు ఇస్తు న్న వారిపై కూడా  అధికారులు దాడు లు చేసి కేసులు నమోదు చేశారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని, నిబంధనల ప్రకారం ఇది నేరమని అధికారులు తెలిపారు.

హైదరాబాద్, మిర్యాలగూడ, సంగారెడ్డి జిల్లాల్లో ఈ ఔషధా లను విక్రయిస్తుండగా వీటిని స్వాధీ నం చేసుకున్నట్లు రాష్ర్ట డ్రగ్ కంట్రోల్ డీజీ కమలాసన్ రెడ్డి తెలిపారు. వీటిని విజయవాడ, ఉత్తరాఖండ్‌లో తయారుచేస్తున్నారని బాధ్యులపై చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు.