calender_icon.png 11 October, 2024 | 11:55 AM

8 నెలల కనిష్ఠానికి తయారీ రంగం వృద్ధి

02-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: దేశంలో తయారీ రంగం వృద్ధి 8 నెలల కనిష్ఠస్థాయికి పడిపోయింది. అమ్మకాలు, ఎగుమతి ఆర్డర్లు అంతంతమాత్రంగానే ఉండటంతో ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి మందగించిందని మంగళవారం విడుదలైన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆగస్టు నెలలో 57.5 శాతం వద్దనున్న హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సెప్టెంబర్‌లో 56.5 శాతానికి తగ్గింది.

ఈ ఏడాది జనవరి తర్వాత ఇంత కనిష్ఠస్థాయికి ఇండెక్స్ తగ్గడం ఇదే ప్రధమం. వేసవి నెలల్లో పటిష్ఠవృద్ధి కనపర్చిన తయారీ రంగం సెప్టెంబర్‌లో మందగించిందని, ఎగుమతుల డిమాండ్  తగ్గడమే ఇందుకు కారణమని హెచ్‌ఎస్‌బీసీ చీఫ్ ఇండియా ఎకానమిస్ట్ ప్రంజుల్ భండారీ తెలిపారు. ఇదే సమయంలో తయారీ రంగానికి ముడి పదార్థాల వ్యయాలతో పాటు అమ్మకపు ధరలు పెరిగా యని చెప్పారు.