బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నంద్యాల మండలంలోని బొప్పారం గ్రామ సమీపంలో గత మూడు రోజులుగా రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండా ఓ బడా కాంట్రాక్టర్ అక్రమంగా పెద్ద ఎత్తున మట్టిని తవ్వి తరలిస్తున్నారు. ప్రోక్లైనర్ తో మట్టిని తవ్వి లారీల్లో యదేచ్చగా అక్రమంగా పెద్ద ఎత్తున తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగాన్ని అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం సర్వత్ర విమర్శలకు తావిస్తోంది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.