calender_icon.png 24 February, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైళ్లల్లో మాన్యువల్ కాపీలు ఉంచాలి

15-02-2025 01:47:19 AM

హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలో మాన్యువల్ కాపీలు ఉంచేలా  ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఖైదీలకు అందుబాటులో జైలు మాన్యువల్ కాపీలు లేకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది జీ జాబాలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీ విజయసేనారెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది సురేశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ జైలు నిబం ధనలను తెలియజేసే మాన్యువల్ ఖైదీలకు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంచాలని కోరారు. ఇది పబ్లిక్ డాక్యుమెంట్ అని అందరికీ అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.

అధికారిక వెబ్‌సైట్‌లో కూడా కాపీలు ఉంచడం లేదన్నారు. పీపీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇలాంటి పిటిషన్లను అనుమతించరాదన్నారు. వివరణ ఇవ్వడానికి గడువు కావాలని కోరడంతో న్యాయమూర్తి అనుమతిస్తూ విచారణను ఈనెల 21కి వాయిదా వేశారు.