ముంబై: పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో మెరిసిన షూటర్ మనూ బాకర్ భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను శనివారం మర్యాద పూర్వకంగా కలిసింది. కుటుంబంతో కలిసి సచిన్ ఇంటికి వెళ్లిన మనూ తాను సాధించిన ఒలింపిక్ పతకాలను చూపించింది. మనూ మాట్లాడుతూ.. ‘క్రికెట్ దిగ్గజంతో మాట్లాడడం అదృష్టంగా భావిస్తు న్నా. టీవీలో సచిన్ ఆడే క్రికెట్‌ను చూస్తూ పెరిగా. నేను చిన్న మ్మాయిగా ఉన్నప్పుడు సచిన్ మైదానంలో కానీ బయట ఎక్కడికి వెళ్లినా టీవీలో వస్తే మాత్రం కన్నార్పకుండా చూసేద్దాన్ని. ఆయ న్ను కలవడం అద్భుతంగా అనిపిస్తోంది’ అని మనూ వెల్లడించింది.