calender_icon.png 18 January, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ లో ఫైనల్ కు చేరిన మను బాకర్

27-07-2024 06:26:44 PM

పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్ విశ్వక్రీడాల ఆరంభ వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. పారిస్ ఒలింపిక్స్  లో శనివారం భారత అథ్లెట్ల పోరు మొదలైంది. 10 మీటర్ల  ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో మను బాకర్ ఫైనల్ కు చేరుకున్నారు. 10 మీటర్ల  ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో ఫైనల్ చేరిన మను బాకర్ అర్హత రౌండ్ లో 580 పాయింట్లతో మూడో స్థానంలో చోటు దక్కించుకుంది. ఎయిర్ పిస్టల్ సింగిల్స్ లో 20 ఏళ్ల తర్వాత భారత షూటర్ ఫైనల్ కు చేరుకున్నారు. 2004వ సంవత్సరంలో ఎయిర్ పిస్టల్ 10 మీటర్ల విభాగంలో సుమా శిరూర్ ఫైనల్స్ కు చేరుకుంది. సుమా శిరూర్ తర్వాత ఒలింపిక్స్ సింగిల్స్ లో మను బాకర్ ఫైనల్ కు చేరుకుని రికార్డు సృష్టించారు. ఎయిర్ పిస్టల్ ఫైనల్ పోరు ఆదివారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు జరుగుతుంది.