calender_icon.png 17 January, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పతాకధారిగా మనూ బాకర్

06-08-2024 02:40:28 AM

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత యువ షూటర్ మనూ బాకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం జరగబోయే ఒలింపిక్ ముగింపు వేడుకల్లో మనూ భారత పతాకధారిగా వ్యవహరించనున్నట్లు భారత ఒలింపిక్ కమిటీ (ఐవోఏ) తెలిపింది.‘మా బృందంలో ఎంతో మంది అర్హులు ఉన్నారు. కానీ ఈ అవకాశం నాకు దక్కడం గౌరవంగా భావిస్తున్నా’ అని మనూ వెల్లడించింది. ఈ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మనూ కాంస్యం నెగ్గింది. ఆపై 10 మీటర్ల మిక్స్‌డ్ పిస్టల్ ఈవెంట్‌లో సరబ్‌జోత్‌తో కలిసి మరో కాంస్యం కైవసం చేసుకుంది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మనూ రికార్డులకెక్కింది.