calender_icon.png 24 November, 2024 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి చెంతకు ముడుపుల పంచాయితీ

16-10-2024 01:37:01 AM

పొన్నంను కలిసిన కరీంనగర్ మిల్లర్లు

కరీంనగర్, అక్టోబరు 15 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో నెలకొన్న ముడుపుల పంచాయితీ మంత్రి పొన్నం ప్రభాకర్ వద్దకు వెళ్లింది. మంగళవారం హైదరాబాద్‌లో కరీంనగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులతో మంత్రి పొన్నం సమావేశమై దిశానిర్దేశం చేశారు.

మిల్లర్స్ అసోసియేషన్‌లో రూ.రెం డు కోట్ల మేర అక్రమాలు చోటు చేసుకున్నాయని కొందరు మిల్లర్లే బాహాటంగా పేర్కొన డం వివాదానికి దారితీసింది. మిల్లర్స్ అసోసియేషన్‌లో అక్రమాలు, ఖర్చు లు, అధికారులకు ముడుపుల వ్యవహారంపై ఇటీవల జరిగిన మిల్లర్ల సంఘం కార్యవర్గ సమావేశంలో చర్చకు వచ్చింది.

ఒక అధికారికి రూ.15 లక్షలు, మరో ఇద్దరు అధికారులకు రూ.10 లక్షల చొప్పున  ఇచ్చినట్లు లెక్కలు చూపించడం వివాదానికి దారితీసింది. ఇటీవల కరీంనగర్‌కు వచ్చిన మంత్రి పొన్నంతో అదనపు కలెక్టర్ సమావేశమై ఈ వ్యవహారాన్ని వివరించారు.  అదనపు కలెక్టర్ నోటీసులు జారీ చేసిన వ్యవహారం కూడా మంత్రి వద్ద చర్చకు వచ్చింది.

అయితే కొంతమంది చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునే ప్ర యత్నం చేయడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలి సింది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనందున విబేధాలు పక్కనపెట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చే యాలని, మరోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే ఉపేక్షిం చేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించినట్లు తెలిసింది.

మంత్రితో భేటీ అయినవా రిలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బోయినపల్లి నర్సింగరావు, సభ్యులు ఉన్నారు.

సన్నరకంపై మిల్లర్ల పేచీ?

మంత్రి వద్ద జరిగిన చర్చల్లో సన్నరకం వరిధాన్యం సేకరణపై రైస్ మిల్లర్లు పేచీ పెట్టినట్లు తెలిసింది. ఖరీఫ్ వరిధాన్యం కొ నుగోళ్లు కరీంనగర్ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. జిల్లాలో ధాన్యం సేకరణ కోసం 340 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశా రు. 5.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉండగా, 4.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేం ద్రాలకు రావచ్చనే అంచనాతో వీటిని ప్రా రంభించారు.

ప్రభుత్వం సన్నరకం వరిధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కరీంనగర్ జిల్లాలో 2,42,570 మెట్రిక్ టన్ను ల సన్నరకం వరిధాన్యం దిగుబడి కానుం ది. అయితే ఇందులో సగం మేర విత్తన అవసరాల కోసం ఆయా కంపెనీలకు వెళ్లనున్నాయి. మిగతా సగం కొనుగోలు కేం ద్రాలకు రానున్నాయి.

సన్నరకం వరిధా న్యం బియ్యంగా మార్చితే నూకలు అధికశాతం వస్తాయని, ఓటు టర్న్ 67 నుంచి 58 శాతానికి తగ్గించాలని, లేదంటే ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్లుగా క్వింటాలుకు రూ.1 50 ఇవ్వాలని రైస్‌మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు.

ధాన్యం నిల్వల తరుగుదలపై ఒక శాతం డ్యామేజీ చార్జిలు చెల్లించాలని, నిల్వ చేసినన్నిరోజులు క్వింటాలు ధాన్యానికి రూ.2.40 చొప్పున చెల్లించాలని, మరాడించేందుకు రా రైస్‌కు క్వింటాలుకు రూ.10 చెల్లించాలని మిల్లర్లు కోరారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మిల్లర్లకు పొన్నం హామీ ఇచ్చినట్టు తెలిసింది.