- నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా..
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మంథని, జూలై 15 (విజయక్రాంతి): మంథని నియోజకవర్గ రూపురేఖలు మార్చి, అభివృద్ధికి రోల్ మోడల్ చేస్తానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సోమవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అమృత్ పథకంలో భాగంగా మం థని పట్టణంలో రూ.12.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్, పైప్‌లైన్ పనులను ప్రారంభించారు.
రామగిరి మండలం రత్నాపూర్‌లో రూ.4.16 కోట్లతో నిర్మించిన కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, పన్నూరులో రూ.3.5 కోట్లతో నిర్మించిన కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తన తండ్రి శ్రీపాదరావు ప్రజానేతగా నియోజకవర్గ ప్రజల బాగోగులు కోరుకున్నారని, ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తున్నానని అన్నారు.
మంథనిని పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశానన్నారు. నియోజకవర్గని యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. జిల్లా లో రెండు 132 కేవీ సబ్ స్టేషన్లు, తొమ్మిది సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరిపై వంతెనను నిర్మించేందుకు ప్రతిపాదన లు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే ఈ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించామన్నారు. నిర్మాణానికి త్వరలో నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చా రు. తమ ప్రభుత్వం కచ్చితంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. మంథనిలో వేర్వేరుగా కూరగాయల మార్కెట్, మాంసం మార్కెట్ నిర్మిస్తామన్నారు. క్రీడాకారుల కోసం స్టేడియం నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు.
అనంతరం మంత్రి పట్టణంలోని గురుకుల పాఠశాలలో అటవీ శాఖ అధ్వర్యంలో వన మహోత్సవంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి వాటికి నీళ్లు పోశారు. కార్యక్రమాల్లో మంథని మునిసిపల్ చైర్‌పర్సన్ పెండ్రు రమాసురేశ్‌రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాయకులు తొట్ల తిరుపతియాదవ్, శశిభూషణ్, కొమురయ్యగౌడ్, దొడ్డ బాలాజీ, వనం రాంచందర్, లోకేందర్‌రెడ్డి, లింగయ్య యాదవ్, కుడుతల వెంకన్న, మద్దెల రాజయ్య పాల్గొన్నారు.